సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, ముదునూరు పాడు గ్రామానికి చెందిన తాడి వెంకట రమణారెడ్డి (60) విమలాదేవి (52) దంపతులు ఆర్థిక సమస్యలతో? బాధపడుతూ నేటి మంగళవారం తెల్లవారు జాము వంటి గంట ప్రాంతంలో ఉంగుటూరు రైల్వే ట్రాక్ మీద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. భార్య భర్తలు ఇద్దరు గత సోమవారం రాత్రి బైక్ పై స్వగ్రామం నుంచి ఉంగుటూరు చేరుకొని అక్కడ జాతీయ రహదారి పక్క న బైక్ ను వదిలేసి అర్ధరాత్రి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ప్రాణాలు తీసుకొన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే సీఐ సోమరాజు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిం చారు. వారి మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
