సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; దేశంలో రైలు లో ప్రయాణించేవారు అత్యవసర లేదా ఇతర సమయాల్లో టికెట్లు అందుబాటులో లేనప్పటికీ.. ‘ఆర్‌ఏసీ (రిజర్వేషన్ ఆగైనెస్టు క్యాన్సిలేషన్)’ క్యాటగిరీలో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడం సర్వసాధరణం. అయితే బోర్డింగ్ సమయానికి ఎవరైనా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటేనే వారికి బెర్త్‌లు కేటాయించ బడతాయి. లేదంటే మరో వ్యక్తితో కలిసి ఒకే బెర్త్‌ను పంచుకొని రైలు ప్రయాణం చేయాల్సిందే!! ఇందుకుగానూ సదరు వ్యక్తికి సగం బెర్త్ కేటాయించినప్పటికీ.. టికెట్ బుకింగ్ సమయంలో పూర్తి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా ఆర్‌ఏసీ క్యాటగిరీ కింద టికెట్లు బుక్ చేసుకొని, ఫుల్ బెర్త్ లేకుండా ప్రయాణించే వారి నుంచి పూర్తి చార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని తాజగా పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అలాంటి ప్రయాణికులకు చార్జీలో కొంత మేర రీఫండ్ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సూచించింది. ఈ మేరకు ప్రజాపద్దుల కమిటీ ‘పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్’ పేరుతో పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది, ఇది అతి త్వరలో అమలు అయ్యే అవకాశం ఉంది.
