సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైల్వేలో ఉద్యోగాల కోసం తాజగా .. లెవల్ 1 పోస్టుల ఖాళీలు 32,438 భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. టెన్త్, ఐటీఐ, అప్రెంటిస్.. వీటిలో ఏ విద్య అర్హత ఉన్న ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికిల్ టెస్టులతో నియామకాలుంటాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు.. అన్ని ఇంక్రిమెంట్స్ తో కలపి మొదటి నెల నుంచి ఏకంగా రూ. 35,000 వేతనం అందుకోవచ్చును. ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్ట్ (ఆర్ఆర్‌బీ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తోంది. అయితే అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్‌బీని ఎంపిక చేసుకోని.. దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22వ తేదీ ఈ పరీక్షను తెలుగులో సైతం రాసుకోవచ్చు.మొత్తం 14 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్ అండ్ టీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంటుల్లో ఉన్నాయి. వీరికి మూల వేతనం రూ. 18,000, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులతో సుమారు రూ. 35,000 మొదటి నెల నుంచి అందుతాయి. పూర్తీ వివరాలకు వెబ్‌సైట్: http://www.rrbapply.gov.in/#/auth/landing ను వీక్షించండి.
