సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు .. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 400 కి పైగా పారామెడికల్ పోస్టులకు కొత్త నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కింద అధికారిక వెబ్సైట్ hwww.rrbapply.gov.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా అప్లై చేసుకోండి. చివరి తేది సెప్టెంబర్ 8, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఆధార్ నంబర్, OTP ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత, దరఖాస్తు ఫారమ్ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉండదు. ప్రారంభ నెలవారీ జీతం స్కేలు సుమారు 44 వేల రూపాయలు పైగా ఉంది. ఇతర అలవెన్సులు ఉంటాయి.
