సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు ప్రయాణం లో ఎక్కువ దూరం తక్కువ ఖర్చుతో చేసే సామాన్యుడి కి ఇబ్బందికర విషయం .. వచ్చే జులై 1వ తేదీ నుండి రైలు టికెట్ ధరలు పెరుగనున్నట్లు రైల్వే శాఖ తాజగా లీక్ వచ్చింది.. అయితే కోవిడ్ 19 సంక్షోభం తర్వాత రైల్వే మొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్వల్ప ఛార్జీల పెరుగుదల జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. 500 కిలోమీటర్లలోపు ప్రయాణానికి సబర్బన్ టిక్కెట్లు, సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఛార్జీల పెంపు ఉండదు. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు టికెట్ ధరలు పెరుగుతాయి. అయితే నెలవారీ సీజన్ టికెట్‌లో ఎటువంటి పెంపు ఉండబోదని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.అలాగే జూలై 1 నుంచి తత్కాల్ రైలు టిక్కెట్ బుకింగ్‌లకు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేస్తూ ఇండియన్ రైల్వే ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. తత్కాల్ లో AC క్లాస్ బుకింగ్‌లకు ఉదయం 10.00 నుంచి ఉదయం 10.30 వరకు, నాన్-AC క్లాస్ బుకింగ్‌లకు ఉదయం 11.00 నుంచి ఉదయం 11.30 వరకు అవకాశం ఉంటుంది.
