సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా లో గత ఏడాది కాలంగా ప్రభుత్వ అధికారులు చేప్పట్టిన ఆక్వా జోన్‌ రీసర్వే నేడు, గురువారంతో పూర్తి చేస్తున్నట్టు మత్స్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే చెరువులలో చేపలు, రొయ్యలు పండిస్తున్న రైతులు రైతులు తమ భూముల సర్వే నెంబర్లు ఆక్వా జోన్‌ పరిధిలో ఉన్నవి లేనిది తెలుసుకుని జోన్‌ పరిధిలో లేకుంటే చేర్చేందుకు సంబంధిత అధికారులకు 1బీ కాపీ పెట్టుకోవాలని సూచించారు. కొత్తగా ఆక్వా పంట కోసం చెరువులుగా మార్చనుకొంటే ఆయా రైతులు నిబంధనలకు అనుగుణంగా భూములున్న ప్రాంతాల పరిధిని ఆక్వా జోన్‌ పరిధిలో పెట్టుకుంటేనే చెరువులకు అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే కొత్తగా చెరువులు తవ్వే రైతులు తమ భూములకు సాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలకు అవకాశం ఉండడమే గాక భూముల చుట్టూ కనీసం 60 శాతం చెరువులుంటేనే ఆక్వా జోన్‌ పరిధిలోకి తీసుకుంటారు. వారికీ చుట్టుపక్కల రైతుల నుండి అభ్యంతరాలు ఉండకూడదని మత్స్యశాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *