సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కి సమీపంలోని కదిలింది గ్రామంలో రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి చందిన విషాదం వెలుగులోకి వచ్చింది. .గత ఆదివారం గంగుల వీర నాగలక్ష్మి (32) అనే మహిళ తన 5 ఏళ్ల కుమార్తె హేమతో కలిసి రొయ్యల చెరువులో మేత వేయడానికి వెళ్లింది. చెరువులోని ఏరియేటర్ (ఆక్సిజన్ గాలిని పంపే యంత్రం ) దాటుతుండగా నాగలక్ష్మి చీర చెంగు దానికి చిక్కుకుంది. దీంతో ఆమె తో పాటు కుమార్తె హేమ కూడా తల్లిని పట్టుకుని ఉండటంతో ఆమె కూడా ఏరియేటర్‌లో చిక్కుకుంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో మృతి చెందారు. మృతురాలి భర్త గంగుల శ్రీనివాసరావు ఫిర్యాదుతో కలిదిండి పోలీసులు కేసు నమోదు చేస్ దర్యాప్తు ప్రారంభించారు.
