సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ​భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం (Seafood Exporters Association of India – SEAI) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని నేడు శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్మ మాట్లాడుతూ .. తాను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతునని, ఈ రొయ్యల పెంపకంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని అని పరిశ్రమతో తన అనుబంధాన్ని తెలియజేశారు. ఈ ​ఆర్థిక సంవత్సరం 2024-25లో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 7.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగం యొక్క మొత్తం విలువ గొలుసును ఆధునీకరించి, ఎగుమతులను ₹ 1 లక్ష కోట్ల లక్ష్యానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ​పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను తాను SEAI అధ్యక్షులు పవన్ కుమార్ తో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్ళానని, వాణిజ్య మంత్రి కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాస వర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *