సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఫై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నేడు, శనివారం అసెంబ్లీలో గాటు విమర్శల దాడి పెంచారు. తాజగా రేవంత్ రెడ్డి కెసిఆర్ కు సవాల్ విసురుతూ.. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని అన్నారు. తాము తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.గతంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని.. కానీ ఇప్పటి వరకు కేసీఆర్‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. గతంలో ఏపీ మంత్రి రోజా ఇంట్లో కేసీఆర్‌ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తుచేశారు. తెలంగాణ కు చెందవలసిన కృష్ణ జలాలను రాయలసీమ వాళ్ళకే తోడేశాడని, ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమకు మేలు చేస్తే తెలంగాణాలో గుండెల్లో పెట్టుకుని మహబూబ్‌నగర్ ప్రజలు నీకు రాజకీయ భిక్షపెడితే గుండెల మీద తంతారా? అని,కెసిఆర్ ను ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి మరణశాసనం రాశారన్నారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచారని అన్నారు. . కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా? అని నిలదీశారు.కేసీఆర్‌ హయాంలోనే నాగార్జున సాగర్‌కు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వచ్చాయని అన్నారు.. అప్పుడు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందంటూ రేవంత్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *