సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేలంగి మామయ్య, మాఫియా డాన్, ప్యాక్షనిస్ట్ , చేనేత కార్మికుడు, సైకో వేషం ఏదయినా దేశం గర్వించదనిగిన సినీ నటులలో ప్రకాశ్ రాజ్ ఒకరు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తరచుగా సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రకాశ్‌రాజ్…తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరుపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ..ఎన్నికల ముందు వరకు పవన్ ప్రజల హక్కుల కోసం సమస్యలపై ప్రశ్నించారు. తీరా ఆయనే స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్ఛోక ప్రజల సమస్యల ను పట్టించుకోకుండా, పవన్ రోజుకో మాట, సరికొత్త గెటప్ లలో కనపడుతున్నాడు. అది సినిమాలలో బాగుంటుంది. కానీ ప్రజా ప్రతినిధిగా మంత్రి హోదాలో చెయ్యకూడదు. ‘నేను సనాతన ధర్మానికి, హిందూ ఇజానికి వ్యతిరేకిని కాను. కానీ సనాతని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ మాత్రం కేవలం రాజకీయ అవసరాల కోసమే మతాన్ని వాడుకుంటున్నాడు. తిరుపతి లడ్డు కల్తీ అయిందంటూ రాజకీయం చేశారు. అధికారం తన చేతిలో ఉంచుకొని, పవన్ కల్యాణ్ నిందితులను పట్టుకోకుండా ఎందుకు ప్రకటనలకే పరిమితమయ్యారు. లడ్డులో కల్తీ నెయ్యి కలిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యానించింది. హిందువులకు పవిత్రమైన లడ్డు సున్నితమైన అంశాన్ని రాజకీయం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవడం మంచిది.కోట్లాది హిందువుల మనోభావాలతో ఆడుకొన్నాడు‘‘ఏడాది క్రితం వరకు ‘మా తండ్రి దేవుడిని నమ్మలేద’ని చెప్పిన పవన్ కల్యాణ్ మాటమార్చి ‘మా తండ్రి రాముడి బోధనలతో నన్ను పెంచాడ’ని ఇప్పుడు చెబుతున్నాడు. నువ్వు ఏ రోజు కా రోజు మారుతుంటే నీతోపాటు అందరూ మారాలనుకోవడం సమంజసం కాదు. పవన్ కల్యాణ్‌కి ఓ సిద్ధాంతం అంటూ లేదు, ఎవరి ప్రాపకం కోసం ఇలా నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడుతున్నారో అర్ధం అవుతుంది అన్నారు.
