సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2వారాలుగా వంటనూనె ధరలు రోజు రోజుకు షేర్ మార్కెట్ రేట్లను మరపిస్తూ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడా దిగిరావడంలేదు.. దిగుమతి సుంకం పెంచారనే కారణంతో వంట ఆయిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. కాదేది నూనె ధర పెంచడానికి అని చెప్పి సన్ ఫ్లవర్, వేరుశెనగ నూనె,.కొబ్బరి నూనె అన్ని ధరలు పెంచుకొంటూపోతున్నారు. ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గత నెల రోజుల కిందట రూ.112లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం కేజీ రూ.130కు విక్రయిస్తున్నారు.మిగతా సన్ పవర్ నూనెలు కొద్దిరోజుల కిందటి వరకూ లీటర్ రూ.105 నుంచి రూ.110 వరకూ అమ్మేవారు. ఇప్పుడు పామాయిల్ కూడా రూ. 120లకు విక్రయిస్తున్నారు. పది కేజీల ఆయిల్‌కు హోల్‌సేల్‌లో సుమా రు 300 పెరిగినట్టు చెబుతున్నారు.పాత నిల్వలను ధరలు మార్చి అమ్మే స్తున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. మరో పక్క మార్కెట్‌లో కందిపప్పు కేజీ ధర రూ. 151కే అమ్మాలని అధికారులు ఆదేశించినా రిటైల్ మార్కెట్‌లో రూ.170 తీసుకుంటున్నారు. ఎవరైనా ఇదేంటని అడిగితే ఆ పప్పు ఉడకదు ఇది నాణ్యమైన రకం అని చెబుతున్నారు.అంతే .. దీని కోసం ప్రభుత్వం భీమవరం బుధవారం మార్కెట్ మునిసిపల్ కాంప్లెక్స్ లో, మరియు రైతు బజార్ లలో కాస్త రాయితీ ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మే కౌంటర్ తెరచింది.
