సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవలి కాలంలో ఎదో బెలూన్ లో గాలి ఊదినట్లు అడ్డు అదుపులేకుండా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే భారీ స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా కొందరు ట్రేడ్ పెద్దలు లాభాల స్వీకరణ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం (ఫిబ్రవరి 2న) విజయవాడ, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,530 కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 9,050 రూపాయలు తగ్గిపోయింది. .ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900కి చేరింది (gold). నిన్నటి ధరతో పోల్చుకుంటే 8,300 రూపాయలు తగ్గింది.మరోవైపు వెండి కూడా వేగంగా పతనమవుతోంది. ఐదు రోజుల క్రితం రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే తిరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.50 వేల మేర తగ్గింది…ఇంకెంత పెరిగిపోతుందో అని అప్పులు చేసి బంగారం వెండి కొన్నవారు లబోదిబో అంటున్నారు.
