సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని రూ.102 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై కేసు దర్యాప్తు జరుగుతుంది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ మరో రెండు సంస్థలతో కలిసి కేరళలో చేపట్టిన జాతీయ రహదారి పనులు మొత్తం పూర్తి కాకుండానే తమ ఆదాయం కోసం నిబంధనలకు విరుద్ధంగా ముందే టోల్ చార్జీలు వసూలు చేశాయన్న ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. ఈనెల 16న హైదరాబాద్‌లోని కేఎంసీ కంపెనీలో సోదాలు చేపట్టింది. కేఎంసీ ఎండీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో, పాలక్కాడ్‌కు చెందిన కొందరు స్వతంత్ర ఇంజనీర్లతో కలిసి తమకు అప్పగించిన రోడ్డు పని పూర్తి కాకుండానే పదేళ్ల పాటు టోల్ వసూలు చేశారు అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. .
