సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌లోని (kodada ) దుర్గాపురం వద్ద నేడు గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (accident) చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆ ప్రాంతంలో నిలిచివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్‌ఐ అశోక్ ( si ashok ), కానిస్టేబుల్ స్వామిగా (constable Swamy) గుర్తించారు. ప్రమాద సమయంలో వారు కారు ప్రయాణిస్తున్నారు. గాయపడిన ఇద్దరిని స్థానికులు , పోలీసులు కలిసి కారులో నుంచి బయటకు తీసి, తక్షణమే కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
