సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎంజగన్ నేడు, గురువారం బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలైన నడి వయస్సు మహిళ రహదారిపై పడి ఉండడం చూసి చలించిపోయారు. విజయవాడలో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న సందర్భంలో వారిధిపై ప్రమాదం జరగడం, వృద్ధురాలు తీవ్ర గాయాలతో ఉండటాన్ని చూసి వెంటనే 108కు స్వయంగా జగనే ఫోన్ చేసినప్పటికీ, ఎవరు ఫోన్ కు స్వాందించక పోవడంతో తక్షణమే ఆమెను తన టీమ్ వద్ద ఉన్న మందులతో ప్రాధమిక వైద్య చికిత్సలు అందించి, ఆసుపత్రిలో చేర్పించే బాధ్యతను తనతో పాటు వస్తున్నా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కు అప్పగించారు.అటుగా వెళుతున్న ప్రైవేటు అంబులెన్స్ పై ఆ వృద్ధురాలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్సీ స్వయంగా తీసుకువెళ్లారు. ఆమెకు ప్రథమ చికిత్సతో పాటు, అన్ని చికిత్సలు అందే వరకు అక్కడే ఉన్న అరుణ్ కుమార్, ఆమె ఆరోగ్య వివరాలను ఫోన్ ద్వారా జగన్ కు సమాచారం అందించారు. అలాగే మహిళకి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా మొండితోక అరుణ్ కుమార్ అందజేశారు.
