సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో నేడు, శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆర్ అండ్ బి అధికారులను .. భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్ల పనుల పురోగతిని ఆరా తీశారు. లక్ష్యం మేరకు నిర్ణీత సమయంలో రోడ్ల పనులు పూర్తి కావాలని అన్నారు. అదే మాదిరిగా ఇప్పటివరకు ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ లు జరిగాయి అని వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇకనుండి రోజువారి పనుల పురోగతిపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ఈ సమావేశంలో డి ఈ రామరాజు, జేఈ శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ నుండి జరుగుతున్న రోడ్ల పనుల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అక్కడక్కడా పెండింగ్ పనులు నిలిచిపోయాయని వాటి త్వరితంగా పూర్తీ చేసి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మార్గాలను ఆధునీకరణ చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
