సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండాకాలం లో రోహిణి కార్తె లో ఎండ దెబ్బకు రొక్కళ్ళు పగులుతాయని నానుడి.. మరి ఇప్పుడు రోహిణీకార్తె ప్రవేశించడంతో ఎండలు ప్రచండమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం 7 గంటల నుండే తీవ్ర ఉక్కపోతలు మొదలు అయ్యిపోతున్నాయి. భానుడు ప్రచండంగా మారిపోవడంతో గత 3 రోజులుగా రోడ్లపై ఉదయం 11 గంటలకు జనసంచారం లేకుండా పోతుంది. ఇంటిపట్టున కూడా తీవ్ర ఉక్కపోత.. ఉదయం నుండి వాతావరణంలో తేమశాతం బాగా తగ్గిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 40 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గకుండా నమోదు అవుతున్న, ఉక్కబోత మాత్రం అంతకు మించి ఉంటుంది. కాబ్బటి మరో 4 రోజులు రోహిణి కార్తె ఎండలను తట్టుకోక తప్పదు. పగలు ఎండ, ఉక్కపోత ఉంటే అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ఎండలు మరింత తడాకా చూపిస్తున్నాయి.
