సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా ఏపీలో ఎండ వేడిమి మాములుగా లేదు.పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుండే ఉక్కబోత మొదలవుతుంది. ఈ రోజు ఎలా గడుస్తుంది దేవుడా? అంటూ ఎండ వేడిమి ప్రజలను భయకంపితులను చేస్తుంది. పలు ప్రాంతాలలో గత 3 రోజులుగా 42 నుండి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వడగాల్పుల తీవ్రత లతో పలువురు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. భీమవరంలో సైతం ఉదయం 11 గంటల తరువాత రోడ్డు మీదకు వస్తే శరీరం ఫై తోలు కాలిపోతున్న పరిస్థితి. రాత్రి 8గంటలు దాటినా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగింది. ఇక దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మొన్న ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందంటే ఇక చెప్పేది ఏమి ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతున్నాయి. ఈ ఎండ తీవ్రత కారణంగా గత 3 రోజులుగా దేశంలో అధికారికంగా 210 మందికి పైగా మరణించారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో 65 మంది, ఒడిశాలో 41 మంది మరణించారు. మరోవైపు జార్ఖండ్రాజధాని రాంచీలో కూడా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
