సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లిలోని వైఎస్సా ర్సీపీ కేం ద్ర కార్యా లయం లో నేడు, ఆదివారం మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ,.. ఓటుకు నోటు కేసు కూడా మరల సుప్రీం కోర్ట్ కు వచ్చిందంటే.. చేసిన పాపలు పండటం తోనే ఇక చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని , ఎవరు కైనా ఇది వర్తిస్తుందని అన్నా రు. కాపులకు రిజర్వే షన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మ నాభం నిరసనకు దిగితే ఆయన్ను అయన కుటుంబాన్ని దారుణంగా వేధించారు. నిజానికి చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదు. మొక్కుబడి నిరసన కార్యక్రమాలకె పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో నివాసం లేని టీడీపీ వాళ్లు ఇతర ప్రాంతాల నుండి కంచాలు మ్రోగించి మ్రోత మోగిస్తే ఉపయోగం ఏమిటని? టీడీపీ నేతలు లంచాలు తిని కంచాలు మోగిస్తారా’’ అంటూ దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిరసన కార్య క్రమాల్లోఎవరూ పాల్గొనడం లేదు. చంద్రబాబుపై కేసులు తో జైలు లో ఉంటే ఉత్తర కుమారుడు లోకేష్ ఎందుకు ఢిల్లీ లో లాయర్లచుట్టూ తిరుగుతున్నారు’’ అని పేర్నినాని ప్రశ్నించారు. బాబు ఇంతకాలం 26 స్టేలు తెచ్చుకుని బతికాడు. యావజ్జీవ ఖైదు తప్పదనే స్టేలు తెచ్చు కున్నారు. కోర్టుల్లో చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి’’ అంటూ పేర్ని నాని అన్నారు.
