సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనమండలిలో నేడు, మంగళవారం తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం నెయ్యి పంపిన పునాకు చెందిన ఇంథర్ సంస్థకు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థ కు అనుబంధం ఉన్న నేపథ్యంలో సీబీఐ నోటీసులు పంపిందని ఆరోపిస్తూ .. కల్తీ నెయ్యి వివాదంలో హెరిటేజ్ సంస్థపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ సభలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ సభ్యుల చేత ప్లే కార్డ్స్ పట్టుకొని గోవిందా గోవిందా అంటూ చేస్తున్న ఆందోళన చేసారు. దీనితో సభ్యుల ఆందోళన ల మధ్య మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లపై పగబట్టినట్టుగా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. హెరిటేజ్‌కు, తిరుపతి లడ్డూకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేని సంస్థను తిరుపతి లడ్డూ వివాదంలోకి తీసుకువచ్చి రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ జరిగిందని చేసిన తప్పిదానికి లెంపలేసు కోవాల్సింది పోయి..హెరిటేజ్ ను ఇరికిస్తున్నారని ఇది విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ సభ్యులు శాంతించకపోవడం తో వైసీపీ సభ్యులు ప్లై కార్డ్స్ తో వేదిక ఎక్కేయ్యడంతో చేసేది లేక . చైర్మన్ కొయ్య మోషేను రాజు సభ ను వాయిదా వేశారు.
