సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి నేతలకు సుప్రీం కోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై నేడు, సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. సీఎం చంద్రబాబు ను మీరు ఏ ఆధారంతో ఏ సాక్ష్యంతో తిరుమల లడ్డు లో జంతువుల క్రొవ్వు కలిసిందని ప్రచారం చేస్తున్నారు? అని ప్రశించింది. దీనివల్ల ఆయన భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. టీటీడీ బోర్డు కూడా ఇటీవల వచ్చిన కల్తీ నెయ్యి ని శాంపిల్స్ కు గుజరాత్ ల్యాబ్ కు పంపించామని అక్కడ రిపోర్ట్ తో నెయ్యిని వెనక్కి తిరిగి పంపించామని చెబుతుందే తప్ప ఆ నెయ్యి ని లడ్డు లో వినియోగించామని ఎక్కడ చెప్పలేదని , పైగా ఆ నెయ్యి శాంపిల్స్ ను మీకు దగ్గరగా ఉన్న ప్రక్క రాష్ట్రాల ల్యాబ్ లలో ఎందుకు టెస్ట్ చేయించలేదని?ఎక్కడో గుజరాజ్ ల్యాబ్ లో ఎందుకు చేయించారని? రాజకీయ కోణం కనపడుతుందని .. గతం ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని ఊహాజనితమైన ఆలోచేనే తప్ప అప్పటి లడ్డు ను ఎక్కడ టెస్ట్ చేసిన దాఖలు లేదని అటువంటిది శ్రీవారి లడ్డు ఎలా కల్తీ జరిగిందని నిర్ధారిస్తారని, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తుంది . ఇలాంటి వాటిపై, అందులోను పవిత్రమైన శ్రీవారి లడ్డుపై సీఎం స్థాయి వ్యక్తి కల్తీ జరిగిందని ఆధారాలు లేకుండా ప్రచారం చేయవచ్చా? అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది.. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
