సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకులు శ్రద్ధ చూపడం లేదని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేటి గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. సిసిఆర్ సి కార్డుల మంజూరు, పశు కిసాన్, ఎస్ హెచ్ జి, ఎంసిపి, పిఎం స్వనిధి, పిఎంఈజిపి, వీవర్స్ ముద్ర యోజన, పీఎం విశ్వకర్మ, సూర్యాఘర్, విద్యా రుణాలు, తదితర అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి బ్యాంకర్లతో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ… విద్యార్థుల ఉన్నత విద్యకు విద్య రుణాలు అందజేస్తే వారు గొప్ప వ్యక్తులుగా తయారవుతారన్నారు. చిన్న వ్యాపారులకు సరళతరంగా రుణాలు అందజేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని, కోట్లాది రూపాయలు రుణాలు మంజూరుపై కన్నా చిరు వ్యాపారాలుకు రుణాలు అందజేయడంపై మానవతా దృక్పథంతో పరిశీలన చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరులో మంచి ప్రగతి నివేదికలతో హాజరు కావాలని అన్నారు. డ్వాక్రా రుణాలు జాప్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. అనంతరం 2024 – 25 మెప్మా అవని” వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో , వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్, జూనియర్ ఆఫీసర్స్, కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.
