సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న సోమవారం లాభాలలో దూసుకొనిపోయిన స్టాక్ మార్కెట్ సూచీలు (81, 373) నేడు, మంగళవారం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దీ సేపు లాభాల్లోనే పెరుగుతూ ఒకదశలో 400 పాయింట్లకు పైగా ఎగబాకి 81, 774 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే హై నుంచి ఏకంగా 1200కు పైగా కోల్పోయి 80, 575 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 636 పాయింట్ల నష్టంతో 80, 737 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 174 పాయింట్ల నష్టంతో 24, 542 వద్ద రోజును ముగించింది.సెన్సెక్స్‌లో హిందుస్తాన్ జింక్, జిందాల్ స్టైయిన్ లెస్ స్టీల్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 258 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.59గా నిలబడింది.
