సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశ స్టాక్ మార్కెట్ సూచీలు ఓ మోస్తరు లాభాలతో నేడు, మంగళవారం ను ముగించాయి. . ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది. గత సెషన్ ముగింపు (83,277)తో పోల్చుకుంటే నేడు మంగళవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకొచ్చింది. చివరకు నేటి సాయంత్రం సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 83,450 వద్ద ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 42 పాయింట్ల లాభంతో 25,725 వద్ద స్థిరపడింది (stock market ).బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 158 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.68గా వద్ద నిలబడింది.
