సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం నుండి వరుసగా భారీ నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలు నేడు మంగళవారం ప్రారంభంలో మాత్రం లాభాలతో ఊరించి కాసేపటికి మళ్లీ కిందకు దిగి వచ్చి నష్టాలతో ముగిసాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఫైనాన్సియల్, మెటల్ రంగాలు మాత్రం లాభాలను అర్జిస్తున్నాయి. మార్కెట్ మొదలైన సమయంలో మొత్తం 16 రంగాలు లాభాలతో మొదలయ్యాయి. గత సోమవారం ముగింపు (80, 364)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత మళ్లీ కిందకు దిగజారింది.సెన్సెక్స్‌లో కోఫోర్జ్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెలివరీ, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news).నేటి ముగింపు సమయానికి పరిస్థితి తెలియవలసి ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.74గా ఉంది.
