సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత కాలమాన ప్రకారం నేడు, సోమవారం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) నేడు, (జనవరి 20న) లాభాలలో దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.35 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 266.20 పాయింట్లు పెరిగి 76,886.53 స్థాయిలో ఉండగా, నిఫ్టీ50 ఇండెక్స్ 61 పాయింట్ల లాభంతో 23,264.40 స్థాయిలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 503 పాయింట్లు ఎగబాకి 49,033 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 10 పాయింట్లు నష్టపోయింది.ఈ క్రమంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా, విప్రో, NTPC, బజాజ్ ఫైనాన్స్, SBI కంపెనీల స్టాక్స్ టాప్ 5లాభాలలో ఉండగా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, HDFC లైఫ్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.
