సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేయడంతో పాటు భారత్‌పై విధించిన సుంకాలను భారీగా తగ్గించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రస్తుతం నేడు, బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో దూసుకెళ్లుతున్నాయి. గత సెషన్ ముగింపు (83, 871)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 450 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 567 పాయింట్ల లాభంతో 84, 439 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 161 పాయింట్ల లాభంతో 25, 856 వద్ద కొనసాగుతోంది (stock market ).నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 309 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.58 దగ్గర ఉంది.
