సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు లాభాల్లో దూసుకొనిపోయిన సూచీలు చివర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలను మూటగట్టుకున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దేశీయ సూచీలు నష్టాలలో పడ్డాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో.. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 75,111 వద్ద ఇంట్రాడే హైని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు 188 పాయింట్ల నష్టంతో 74,482 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయి 22,604 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 33 పాయింట్ల స్వల్ప లాభాన్ని ఆర్జించింది.
