సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ సూచీలు నేడు, బుధవారం కూడా లాభాల జోష్‌ కొనసాగించాయి. విదేశీ మదుపర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు పాజిటివ్‌గా మారింది. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం కూడా కలిసి వస్తోంది.గత మంగళవారం సెషన్ ముగింపు (83,450)తో పోల్చుకుంటే నేడు బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి దూసుకొచ్చింది. చివరకు సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 83,734 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 93 పాయింట్ల లాభంతో 25,819 వద్ద స్థిరపడింది (stock market ) బ్యాంక్ నిఫ్టీ 376 పాయింట్లు సాధించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 301 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.67గా నిలబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *