సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నేడు, సోమవారం మొదట లాభాలలో ఉన్న మార్కెట్లను నష్టాలలోకి లాగాయి. గత వారం సెషన్ ముగింపు (85, 041)తో పోల్చుకుంటే నేడు సోమవారం ఒక దశలో 250 పాయింట్లకు పైగా లాభపడి 85, 250 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. చివరకు సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 84, 695 వద్ద రోజును (stock market ). ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 100 పాయింట్ల నష్టంతో 25, 942 వద్ద స్థిరపడింది. మళ్లీ 26 వేల దిగువకు పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 313 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 89.97గా ఉంది.
