సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో నేడు, సోమవారం బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలను లాభాల బాట పట్టిస్తున్నాయి.. మరోవైపు కొత్త ఐపీవో జోష్ కూడా సూచీలను ధాటిగా నడిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి. గత వారంలో శుక్రవారం ముగింపు (81, 207)తో పోల్చుకుంటే నేటి సోమవారం ఉదయం దాదాపు 70 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత దూసుకొనిపోయింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన బ్యాకింగ్ సెక్టార్‌కు పాజిటివ్‌గా మారింది. ప్రస్తుతం ఉదయం సుమారు 10 గంటల సమయంలో సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 81, 368 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 48 పాయింట్ల లాభంతో 24, 943 వద్ద కొనసాగుతోంది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 92 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.75 వద్ద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *