సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ఇరాన్, మధ్య 45 రోజుల పాటు యుద్ధ విరామం కోసం యూరో మరియు గల్ఫ్ దేశాలలోని కొందరు మధ్యవర్తులు రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నడుమ నేడు, సోమవారం భారత్ దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. నేటి ఉదయం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగయింది. గత వారం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 787.30 పాయింట్ల మేర లాభపడి 74,106.85 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 255.15 పాయింట్ల లాభంతో 22,968.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో టైటన్ కంపెనీ, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీలో ట్రెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్‌లో నిలిచాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 108 డాలర్ల వద్ద నిలబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *