సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి పాలకొల్లు వెళ్లే రహదారి లో నేడు, శుక్రవారం ఉదయం .. వీరవాసరం దాటాక భగ్గేశ్వరం వద్ద బైక్ ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు మరణించగా, మరో వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యినట్లు తాజా సమాచారం. గాయపడిన వ్యక్తి ని ఆసుపత్రిలో చేర్చగా అక్కడికి చేరుకొన్న పోలీసులు కేసును విచారిస్తున్నారు. ఇంకా పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.
