సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లిటిల్ హార్ట్స్ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సాయి మార్తాండ్ తన రెండవ సినిమా సీనియర్ హీరో జగపతి బాబు నిర్మాతగా ఆయనే కీలక పాత్రలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో హీరోగా గత 5 ఏళ్లుగా పరాజయాలు చవి చూస్తున్న నితిన్ నటిస్తారని ఫిల్మ్ నగర్ వార్త.. నిజానికి లిటిల్ హార్ట్స్ లో రాజీవ్ కనకాల పాత్రలో జగపతి బాబు నటించాల్సి ఉంది. అయితే జగపతి బాబే కధలో మార్పులు చేసి తాను తప్పుకొన్నారు. అయితే యువ డైరెక్టర్ ను ప్రోత్సహించాలని తదుపరి సినిమా తానే నిర్మిస్తానని కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చారని సాయి మార్తాండ్ ఇటీవల స్వయంగా చెప్పారు. అప్పటికి లిటిల్ హార్ట్స్ షూటింగ్ ఇంకా హాఫ్ మాత్రమే అయింది. అయినా ఆయన నన్ను నమ్మి ఇచ్చారు. నా నెక్స్ట్ సినిమా ఆయనతోనే చేస్తాను అని తెలిపారు.
