సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాట మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్‌ఎమ్) పార్టీ అధినేత, సినీ లోకనాయకుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్..తన రాష్ట్ర కేబినెట్‌లోని మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాకాలు చేస్తోంది. ఇక 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తురు లోక్ సభ స్థానం నుంచి తన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. మరోవైపు తమిళ సినీ టాప్ హీరో విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలోకమల్ హాసన్ క్రేజ్ ను పార్టీ సహకారంను తమకు మద్దతుగా ఉపయోగించేనుకొనే అవకాశం ఉంది. కమల్ హాసన్ ప్రస్తుతమ్ ప్రభాస్ హీరోగా కల్కి 2 సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్న విషయం అందరికి విదితమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *