సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మంత్రి అంబటి రాంబాబు నేడు, శనివారం గుంటూరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోకేష్ ది యువగళం కాదు.. యువ గరళం.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా లోకేష్ తీరు ఉం దని, ఒళ్ళంతా పుండులు అయ్యాక వారికీ, అతని సమర్ధత ఫై చూసేవారికి త్వరలో వాస్తవం తెలుస్తుంది. అన్నారు. ‘అచ్చెన్నాయుడు బూతు మాటల తీరుపై రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. పోలీసులను ఉద్దేశిం చి బూతులు మాట్లాడతారా? టీడీపీ పతనానికి నాంది. పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు మాట్లాడే తీరు ఇదేనా?లోకేష్ కు అర్హత అనే మాట కూడా స్పష్టంగా పలకడం రాదు.ఆయన చెప్పే అబద్దాలు కూడా ఎవరికీ అర్ధం కాదు.. లోకేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ..ఎన్నో జరుగుతున్నాయి.. అందరికి తెలిసిందే..‘లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యాడు.ప్రజలు అంగీకరించిన నాయకుడుకాదు.. అప్పుడే వారాహి ని కూడా అడ్డుకోలేరు అని పవన్ తరుపున లోకేష్ తన పాదయాత్రలో సవాల్ చేస్తున్నాడు. అంటే పొత్తు సెటిల్ అయినట్లే కదా? నిన్న, పవన్ కూడా తన కన్న తండ్రి గురించి మాట్లాడుతూ దీపారాధనలో సిగరెట్ వెలిగించుకొంటారని గొప్పగా చెప్పుకొన్నాడు.. ఏమి మాట్లాడాలో తెలియని పవన్ లోకేష్ లను వారి పాదయాత్ర లను, వారాహి లను ఎవరు అడ్డుకొంటారు? ఎంతమంది కలిసొచ్చిన జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతారు. ’’ అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.
