సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో జరిగిన ఉద్రిక్తత లు దాడులు నేపథ్యంలో పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారాలతో గత రాత్రి దాడులు చేసిన వారిని, రాళ్ళూ విసిరి గలాటా చేసినవారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం మొదలు పెట్టారు. దీనిలో భాగంగా పోలీసులు నేటి బుధవారం తెల్లవారు జామున బేతపూడి లోకేష్ యువగళం క్యాంప్ కి వెళ్లి అక్కడ ‘రెడ్’ వాలంటీర్లు ను సుమారు 40 మందిని అదుపులోకి తీసుకోని 3 వ్యానులలో కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నేటి బుధవారం ఉదయం భీమవరం పోలీసులు నారాలోకేష్ కు నోటీసులు అందజేశారు. భీమవరంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని, పాదయాత్రలో నిబంధనలు అతిక్రమించారని ఉద్రిక్తలకు తావిచ్చేలా వ్యవహరించారని దీనికి సంజాయిషీ చెప్పాలని పోలీస్ నోటీసులు ఇచ్చారు. నోటీసు తీసుకొనే ముందు నారాలోకేష్ మీరే నోటీసు చదివి వినిపించండి.. మీరు వైసిపి వారి దాడులు కంట్రోల్ చెయ్యలేక మరల మాకే నోటీసులు ఇచ్చారు అని నారాలోకేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *