సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ యువనేత , చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా లోకేష్‌తోపాటు తారకరత్న కుప్పం మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుంచి బయటకు వస్తూ జనంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన పల్స్ ఆగిపోవడం తో అందరు ఆందోళన చెంది, వెంటనే పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 45 నిమిషాల తరువాత పల్స్ అందుకొన్నట్లు డాక్టర్స్ అంటున్నారు. గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారని.. వెంటనే డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారని మొదట మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎటువంటి స్టంట్ వెయ్యలేదని , పరిస్థితి ఇంకా అదుపులోకి రావలసి ఉందని , బెంగుళూరు తరలించి అక్కడ వైద్యం చేయిస్తామని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది. పాదయాత్రలో ఉన్న సినీహీరో బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న హిందూపురం పర్యటనలో సాయంత్రం బాలకృష్ణ వాహనంపై తూలినప్పుడు కూడా తారక తారక రత్న అక్కడే ఉండటం గమనార్హం.. తారక రత్న ను బెంగుళూర్ తరలించడానికి బాలకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.దేవుని దయతో తారక రత్న తప్పకుండ కోలుకొంటారని ఆశాభావం వ్యక్తం చేసారు.
