సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు తనయుడు టీడీపీ కార్యదర్శి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్,లపై మంత్రి రోజా నేడు, బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయిన లోకేష్ పాదయాత్రతో ఏదేదో జరిగిపోతుందని భ్రమలో ఉన్నారన్నారు. కానీ పాదయాత్రలో మొదటి రోజే వాళ్ళకి అంతలేదు అని అర్థం అయిపోతుందని రోజా ఎద్దేవా చేసారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ నాశనం అయ్యిందని .. అక్కడ తెలంగాణలోనూ, ఇక్కడ ఏపీలో అన్ని విధాలుగా దెబ్బతిన్దని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందనడం శుభపరిణామమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై రోజుకు ఒక మాట మాట్లాడి తన రాజకీయ అవగాహన రాహిత్యం బయట పెట్టుకొన్నాడన్నారు. ఏపీలో పలు జిల్లాల్లో జనసేన పార్టీకి అధ్యక్షులే లేరని వారికి నిలబెట్టడానికి అసలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు లేరని రోజా విమర్శించారు. అది జనసేన కాదు చంద్రసేన అని విమర్శించారు. ఇక బాలకృష్ణ కీర్తి శేషులు ,అక్కినేనిని, ఎస్వీ రంగారావుల గురించి అవమానించడం చాల తప్పన్నారు. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదన్నారు. నిజానికి ఆయన గతంలో ఎప్పుడు సరిదిద్దుకోడన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిందని.. అప్పటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం హత్యలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో హత్య జరిగితే దోషులను పెట్టుకోకుండా ఇప్పుడు మా వైసిపి నేతలపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
