సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ పోలీస్ అధికారి, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గేదే లే.. అంటూన్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై చాల దారుణమైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో ఇదే విధంగా వైసీపీ నేతలపై పలు పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ ను( టీడీపీ నుండి బహిష్కరించారు. ) పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా వారిని పోలీస్ వ్యాను వెంబడించి తనకు అప్పగించాలంటూ రచ్చ రచ్చ చేసి వారు నిరాకరించడంతో ఎస్పీ కార్యాలయం వరకు ఆ వ్యాను ను వెంబడించి టీడీపీ కార్యకర్త కిరణ్ ఫై అక్కడే దాడికి ప్రయత్నించడం ఫై పోలీసులు గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పోలిసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ తీవ్ర భయాందోళనకు గురిఅయ్యాడు.. ఆ వెంటనే బయటకువచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిన్న తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై జగన్ కు ప్రాణానికి ముప్పు తలపెడుతున్నారని, కుట్ర జరుగుతుందని మాధవ్ ఆరోపించారు. అదే క్రమంలో ఆడవాళ్లకు అక్కా కాదు, మగవాళ్లకూ బావా కాని లోకేష్ బాబుకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చి సీఆర్పీఎఫ్ బలగాల్ని కేటాయించి, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు భద్రత ఇవ్వరా? అంటూ మాధవ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్ధాయిలో ప్రశ్నించారు.దీనిపై గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జి. నాగేశ్వరరావు అనే తాడేపల్లి కి చెందిన టీడీపీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
