సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు వేగేశ్న కనకరాజు సూరి, మల్లినిడి తిరుమలరావు, జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పై భీమవరంలో దాడి జరిగిందని ఇది పికిరిపందల చర్యగా ఖండిస్తున్నామని అన్నారు. ఇటువంటి దాడులు భీమవరంలో ఎప్పుడు జరగలేదని, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూడటం సిగ్గు చేటని .. వైసీపీ నేతలు లోకేష్ ఫై టీడీపీ వారిపై రాళ్లతో కర్రలు, సోడా సీసాలలో పెద్ద ఎత్తున దాడి చేయడం మంచి పద్దతి కాదని, ఈ ఘటనను చీకటి రోజుగా భావిస్తున్నామని, ప్రజలకు జీవించే పోరాడే ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగ కల్పించిందని, భీమవరంలో మాత్రం పోరాడే హక్కును మాత్రం కాలరాస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన జెండా ఎగుర వేయడం ఖాయమని,వైసిపికి సమాధి కట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు,వీర మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
