సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫై గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకునిమాట్లాడాలి అని హేచ్చరించారు, పవన్ రోడ్డుపై రౌడీలా కారు ముందు కూర్చుని రోడ్ షో లు చేయడమేంటి?. ఎవరిని భయపెట్టాలని? రెచ్చగొట్టాలని? నిజంగా పవన్కు దమ్ముంటే జనసేన తరపున 175 స్థానాల్లోఅభ్యర్థులను దింపాలి. పవన్ ,చంద్రబాబు ఎన్ని నాటకాలు వేసిన ప్రజా బలంతో ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలుస్తారు. పాలిటిక్స్ అంటే ప్రతీరోజు యుద్ధమే. పవన్ నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడకి వచ్చి జీరో వేషాలు వేస్తే ప్రజలు హీరోను చేయరు. ఇప్పటం విషయంలో హైకోర్టు ను తప్పుదారి పట్టించారని పిటిషన్ వేసిన 14 మందికి ప్రతి ఒక్కరికి లక్ష చప్పున ఫైన్ వేశారని గుర్తు చేస్తూ..మంగళగిరి దగ్గర ఇప్పటంలో జరిగిన పవన్ హైడ్రామా కు జరిగిన అవమానం అందరు చూసారని, దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అని, . నిజానికి నారా లోకేశ్ అక్కడ పోటీచేసి ఓడిపోతే అక్కడ ఓ సమస్య వస్తే లోకేశ్ లేదా చంద్రబాబు వెళ్లాలి. అలాకాకుండా పవన్ను పంపించి ఫూల్ని చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబును పవన్ తిట్టకుండా సంబంధం లేని సీఎం వైఎస్ జగన్ను నిందిస్తున్నారు అని విమర్శించాహ్రూ రోజా.
