సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ సహా మొత్తం 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. అధికార బీజేపీ ఎన్డీయే సభ్యులకు పక్షపాతిగా వ్య్వవహరిస్తున్నారని .. ఇక సభలో విపక్షాలకు స్పీకర్‌ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ రూల్‌ 94 సీ కింద స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని. మొత్తం 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని.. విపక్ష పార్టీల నేతలు, రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ ఎంపీలు పదే పదే అడ్డుతగుతున్నారని, బీజేపీ సభ్యులు సభలో బూతులు మాట్లాడుతున్నప్పటికి మైక్‌ కట్‌ చేయడం లేదని కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *