సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త్వరలో దేశంలో లోక్ సభ,కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహించేందుకు బిల్లును మోడీ సర్కార్ నేడు, మంగళవారం లోక్‌సభ సమావేశాలలో సభ్యుల ముందుకు తీసుకొచ్చింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై చర్చ కొనసాగుతుండగా.. అటు ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఖర్చు కలసి వస్తుందని అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వాహిస్తే దేశంలో ప్రజల సమస్యలను పాలకులు పట్టించుకోరని నియంతృత్వ పోకడలు పెరుగుతాయని వారు వాదిస్తున్నారు. అయితే జమిలి బిల్లును JPC పరిశీలించడానికి తొలుత 90 రోజుల సమయం ఇస్తారు. అయితే ఏపీ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాల గడువు 2029 వరకు ఉంటుంది. మరి.. రెండేళ్ల పరిపాలన రద్దు చేసుకుని 2027 కల్లా ఎన్నికలకు వెళ్ళవలసి ఉంది. మరి ఎన్డీయే కూటమిలోని టీడీపీ దీనికి మద్దతు ఇస్తుందా?జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే.. పార్లమెంట్‌లో మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం. అంటే, పార్లమెంట్‌లో 67శాతం సపోర్ట్ కావాలి.. లోక్‌సభలో 362మంది ఎంపీలు, రాజ్యసభలో 164మంది సభ్యులు మద్దతు దొరికితే బిల్లు అమలు అవుతుంది. లోక్‌సభలో 543మంది ఎంపీలు ఉంటే.. అధికారపక్షం ఎన్డీఏకి 293మంది.. విపక్ష ఇండియా కూటమికి 235మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245మంది సభ్యులు ఉంటే.. అధికారపక్షం ఎన్డీఏకి 125మంది.. విపక్ష ఇండియా కూటమికి 88మంది ఎంపీలు ఉన్నారు. అయితే వైసీపీ కి లోక్ సభలో 4గురు రాజ్యసభలో ఉన్న 8 మంది సభ్యులు మద్దతు ఎన్డీయే కు లభిస్తుంది. అయితే మోడీ అమిత్ షా ద్వయం అసాధ్యాలను సుసాధ్యాలను చేసే పూహ్యం ఎవరికీ అంతు చిక్కదు
