సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ సరిహద్దు వివాదంపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి. భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడు తోందని, భారత్ భూభాగం ఆక్రమణకు గురి అవుతుందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నవరణే తన పుస్తకంలో రాశారు. వీటికి సంబంధించిన అంశాలు ఓ మ్యాగజైన్ ప్రచూరించగా.. దీని గురించి రాహుల్‌గాంధీ లోక్‌సభలో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ చెబుతున్న ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని అమిత్ షా అన్నారు. ప్రచురితం కాని బుక్‌లోని అంశాల గురించి లోక్‌సభలో ఎలా మాట్లాడుతారంటూ రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడంది. సభను అవమానించేలా మాట్లాడతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో లోక్‌సభను మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన చేశారు.
