సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సార్వత్రిక ఎన్నికలకు రేపు శనివారం నగారా మోగనుంది. రేపటి మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత లోక్ సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది..లోక్ సభతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ఈసారి కూడా ఏప్రిల్ – మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దానితో దేశవ్యాప్తంగా అధికార పార్టీల అధికారాలకు దూరంగా ప్రభుత్వ అధికారుల రాజ్యం అమలులోకి వస్తుంది..
