సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి ఢిల్లీ లో జరిగిన లోక్ సభ స్పీకర్, ఓం బిర్లా కుమార్తె వివాహానికి జాతీయ రాజకీయ ప్రముఖులతో పాటు భీమవరం కు చెందిన రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు మరియు అసెంబ్లీ ఉప సభాపతి కే రఘురామా కృష్ణంరాజు హాజరు అయ్యి నూతన వధువరులకు శుభాబినందనాలు తెలిపారు. ఫై చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వీరితో పాటు హాజరు అయ్యారు. ఏది ఏమైనా రాష్ట్రానికి కీలకమైన 2 చట్ట సభలను నడిపించే అవకాశం.. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అంజిబాబు ను ఎన్నుకోవడం భీమవరం ప్రాంత ప్రజా ప్రతినిదులకే రావడం.. అలాగే బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి గా పనిచేస్తుండటం పార్టీలు వేరు అయిన భీమవరం అభివృద్ధికి గొప్ప పరిణామం గానే భావించాలి.
