సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇటీవల కాలంలో క్రమం తప్పకుండా ప్రతి రోజు వర్షం కురుస్తున్నప్పటికీ భీమవరం మండలం లోసరి పంచాయతీ లో తన “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో వరి రైతులను, ఆక్వా రైతులను తమ ప్రభుత్వం మాత్రమే ఆదుకుంటుందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. లో సరి గ్రామంలో సుమారు ఎనభై ఆరు మంది ఆక్వా రైతులకు గత మూడు సంవత్సరాలుగా చూస్తే విద్యుత్ విషయంలో రూ.రెండు కోట్ల 24 లక్షల 57 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆక్వా రైతులను ఆదుకో లేదని అన్నారు. నేడు, సోమవారం గరవలదిబ్బలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా? అని అడుగుతూ నిబంధనలమేరకు అర్హత ప్రతి ఒక్కరు కులమత , రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. నేటి సాయంత్రం భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ బాలేపల్లి,నందమురుగురువు గ్రామాలకి చెందిన రైతులకు “కృషి” ట్రాక్టర్లను అందజేశారు.
