సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం లోసరి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ , భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానికులు ఆయనఫై పుష్పాలు చల్లుతూ ఘన స్వగతం పలికారు. ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ.. గ్రామా స్వరాజ్యం లక్ష్యంగా గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు అందరు తమకు కావలసిన సంక్షేమ పధకాలు పొందటానికి, పనులు, అన్ని సర్టిఫికెట్లు స్థానికంగానే పొందటానికి దూరంగా ఉన్న పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా అవినీతికి కమిషన్స్ కు తావులేకుండా ఎక్కడ గ్రామంలో సమస్యలు అక్కడే పరిస్కారం అయ్యే దిశగా సీఎం జగన్ ప్రారంభించిన మహా యజ్ఞం లో భాగంగా లోసరి గ్రామాప్రజల కోసం 40 లక్షల ప్రభుత్వ నిధులతో స్వంత సచివాలయ భవనం నిర్మించి ఇవ్వడం నేడు తాను ప్రారంభోత్సవం చెయ్యడం గర్వముగా ఉందన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
