సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎక్కడా వోల్టేజీ సమస్యలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇన్‌ చార్జి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలు, లో వోల్టేజీ సమస్యలు, నూతన సబ్ స్టేషన్లు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, వినియోగదారుల స్పందన వంటి అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సోలార్ విద్యుత్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సేవల్లో రాష్ట్రంలోనే మన జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. ఈ సమీక్షలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, తాడేపల్లిగూడెం, ఆచంట ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, జెసి టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *